తెలుగు బ్లాగర్లలో బాగా డబ్బు సంపాదించినవాళ్లెవరయినా ఉన్నారా? మరోసారి అడుగుతా, బ్లాగింగ్ ద్వారా డబ్బు సంపాదించిన తెలుగువాళ్లెవరయినా ఉన్నారా? మొదటి ప్రశ్నకేమోగానీ, రెండో ప్రశ్నకు సమాధానం విశాఖపట్నం కుర్రాడు ‘చందూ’. ఐఐఎంలో చదువు, టీసీఎస్ లో ఉద్యోగం… వీటన్నిటినీ వదిలేసి, సైబర్ ప్రపంచంలో ఒక వెలుగు వెలుగుతున్న చందూ తోటివారికి మార్గదర్శి. కంప్యూటర్ వాడేవారిలో ఎక్కువమంది ఉపయోగించే ఎక్సెల్ గురించి బ్లాగింగు చేస్తూ ఒక ఏడాదిలో లక్ష అమెరికన్ డాలర్లు సంపాదించడమంటే మాటలేం కాదు. ‘ఎక్సలెంట్’ అనిపించే ఆ ఘనతనెలా సాధించాడో చందూయే వివరించిన ఇంటర్వ్యూ ఇక్కడ…
Advertisement



wow!!
చాలా చక్కని పోస్ట్. స్వతంత్రంగా తన కాళ్ళమీద తను నిలబడాలి అనుకునేవారికి ఇంటర్నెట్ కూడ చక్కని అవకాశాలు కలిపిస్తుంది. జాలంలో కూడ, పట్టుదల, శ్రమ, దీక్ష, అంకితభావం, నిబద్దత తప్పని సరి. సమయపాలన కూడ ఉండాలి. ఒక పూటలోనో ఒక రోజులోనే ఫలితం దక్కదు. కష్టే ఫలి.
చందు.ఒఆర్‌జి సంపాదన తన ఇంగ్లిష్ బ్లాగు ద్వార..తెలుగుకి భాషకి ఇంకా అంత ఆదరణ లభించడంలేదు.
Pingback: ఇద్దరు స్ఫూర్తి ప్రధాతలు « అంతర్వాహిని
Pingback: ఇద్దరు స్ఫూర్తి ప్రధాతలు » Andhra Reloaded