ఒక్క దు:ఖమూ అనేక ఛాయలూ

సాంఖ్య దర్శనంలో మూడు రకాల దు:ఖాల గురించి చెప్పారు. 1. ఆధ్యాత్మిక దు:ఖం 2. ఆధి భౌతిక దు:ఖం 3. ఆది దైవిక దు:ఖం. మొదటిది శారీరక అనారోగ్యం, మానసికంగా వియోగం వల్ల కలిగేది. తన ప్రమేయం లేకుండా ఇతరుల వల్ల కలిగేది రెండోది. పాము కాటు, దొంగలు పడటంలాంటివి. మూడోది శీతోష్ణ ప్రకోపాలు, గాలివానలు, పిడుగుపాటు వల్ల కలిగేది.

దు:ఖానికి తొమ్మిది రకాల ఛాయలున్నాయి. 1. పీడ 2. బాధ (అంటే కలియబెట్టడం వల్ల కలిగేది) 3. వ్యధ (భయపెట్టేది) 4. దు:ఖం 5. ఆమనస్యం (మనస్సునందు ఒప్పేది మానస్యం. దానికి విరుద్ధమైనది అంటే మనసుకు సుఖంగా ఉండనిది) 6. ప్రసూతిజం (స్త్రీలకు కాన్పువల్ల కలిగేది) 7. కృఛం (ఛేదించేది) 8. కష్టం (హింసింపజేసేది) 9. అభీలం (అంతటా భయాన్ని కలిగించేది).

శోకం అనేది చిన్నది. దు:ఖానికి శోకం ఒక వ్యక్తీకరణ. దు:ఖం పెద్దది. అది శారీరకం, మానసికంగా కూడా హింస పెడుతుంది.

——————————

వ్యక్తీకరణకు తగిన పదాలు తెలియక ఇబ్బంది పడుతున్నప్పుడు ఇలాంటివి అక్కరకొస్తాయి. ఇది సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధంలో వేమన్న వెలుగులు శీర్షికన డా. ఎన్ . గోపి నిర్వహిస్తున్న కాలమ్ లో కనిపించింది.

పుట్టు దు:ఖమునను, పొరలు దు:ఖమునను

గిట్టు దు:ఖమునను, క్రిందజనును

మనుజ దు:ఖమువలె మరిలేదు దు:ఖంబు

విశ్వదాభిరామ వినురవేమ

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s