చందనం బొమ్మ కొన్ని కబుర్లు

ఎన్నో సమస్యలను దాటి ముందుకొచ్చేశాం, ఎంతో అభివృద్ధిని సాధించేశాం అనుకుంటాంగానీ అవన్నీ భ్రమలని ఎప్పటికప్పుడు తేలిపోతూనే ఉంటుంది. కులమతాలు, అంతస్తులు, ఆడామగా వివక్ష వంటివాటితో పాటు మనుషుల ఒంటి రంగు అలాంటి అంశమే. దానికి సంబంధించిన స్పృహతో రాసిన కథ చందనం బొమ్మ. ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ప్రచురితమైన ఆ కథను చదివి మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా ఇక్కడ తెలియజెయ్యండి. ఈ కథ గురించిగానీ, ఆదివారం సంచికలోని ఇతర రచనల మీద గానీ మీ అభిప్రాయాలను నేరుగా వారికే తెలియజెయ్యడానికి sunday.aj@gmail.com, sundayajy@yahoo.com లకు మెయిల్ రాయవచ్చు. మీ రచనలు ఆదివారం ఇంఛార్జికి పంపడానికి కూడా ఇదే రహదారి.

2009లో చదివినవాటి గురించి రాయమని పుస్తకం డాట్ నెట్ వారు ఫోకస్ పెట్టినప్పుడు ‘అబ్బే మనకంత సరుకు లేద’ని వదిలేశాను. చాలా రోజులు ఇంటర్నెట్ లేకపోవడంతో ఫోకస్ వ్యాసాల పుణ్యకాలం అయిపోయిందేమో అనుకున్నాను. అయినా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవడం మంచిదేలెమ్మని గుర్తు చేసుకుని రాసిన వ్యాసం ఇక్కడ. అక్కడ చెప్పడం మర్చిపోయిన పుస్తకం గొర్రెపాటి రవీంద్రనాథ్ ఇట్లు ఒక రైతు’. ఇదీ, ‘ వనవాసి’ నన్ను అమితంగా ప్రభావితం చేసిన పుస్తకాలు. కిందటివారం చదివిన ‘చిత్రగ్రీవం’ కూడా. దాని గురించి విడిగా రాస్తాను.

తెలుగు పాఠకులకు చిరపరిచితురాలయిన రచయిత్రి కుప్పిలి పద్మ రాసిన ‘వెన్నెల’ అనుభవాలు ఇక్కడ. ఆంధ్రజ్యోతి ‘నవ్య’లో ప్రతి ఆదివారం పాఠకులు వెన్నెలతో తమ అనుభవాలను రాసి పంపొచ్చు. బ్లాగరులు కూడా రాయొచ్చు. ఈనెల పదిహేడునే విజయనగరంలో చాసో స్ఫూర్తి పురస్కారాన్ని అందుకున్నారు కుప్పిలి పద్మ.

Advertisements

5 thoughts on “చందనం బొమ్మ కొన్ని కబుర్లు

  1. చాలా బాగుందండీ కథ. చక్కగా నడిపించారు చివరిదాకా. పెద్ద సమస్య కాదు కానీ ఆడుకుంటున్న బొమ్మ అరగదీసి దెబ్బలు తగిలినప్పుడు గంధం రాయడం నేను ఇదివరకెప్పుడూ వినలేదు. చెయ్యకూడదు అని కాదు కానీ … ఏమైనా మంచి కథ.
    ఎప్పటిలాగే, ఇంగ్లీషు పదాలు కాస్త తగ్గిస్తే ఇంకా పట్టు వచ్చి వుండేది కథకి. మీ వర్డ్ కాన్సర్ లక్షణాలా. :). అభినందనలు.

  2. మొత్తమ్మీద మీరిక్కడ వున్నారని తెలిసి సంతోషంగా అనిపించిందండీ. నెమ్మదిగా మీ రచనలు చదవాల్సివుంది.

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s