కూ… చుక్‌చుక్‌… పొగబండి కథలు

చిన్నప్పుడు రైలింజను డ్రైవర్‌ అవాలన్న కోరిక చాలామందికే ఉంటుంది. నాకు మరీ డ్రైవరవాలని ఉండేదికాదుగానీ, ఒక్కసారి ఇంజన్‌లోకి వెళ్లి, రైలెలా నడుస్తుందో చూడాలని మాత్రం కోరిగ్గా ఉండేది. చిన్నప్పుడే కాదు, ఇప్పటికీ ఉంది. రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు మరీ చిన్న స్టేషన్లను చూస్తున్నప్పుడు ఏదో తెలియని ఆసక్తి చోటు చేసుకుంటుంది నాలో. ఒక సాధారణ భవనం, చుట్టూ జనాల అలికిడి అస్సలు లేని చోట – పని ఎలా ఉంటుంది, ఉద్యోగజీవితం ఎలా ఉంటుంది.. ఇలాంటి ప్రశ్నలు అసందర్భంగా చుట్టుముడుతూ ఉంటాయి. అలాంటి  కొన్ని ప్రశ్నలకు సమాధానం ఓలేటి శ్రీనివాసభాను రాసిన ‘పొగబండి కథలు’ సంకలనంలో దొరుకుతుంది. చిన్న పుస్తకం, చిన్నచిన్న కథలు. చదివితే పరిచయమయ్యే జీవితమే చాలా పెద్దది. ఏ మాత్రం వీలున్నా తప్పకుండా చదవండి. రైలు వెళ్లిపోయాక కూడా కనిపించే పొగలాగా కథల పరిమళం పుస్తకం మూసేశాక కూడా చాలాకాలం గుర్తుంటుంది. ఈ పుస్తకం గురించి పంతుల జోగారావు పరిచయం, ఒక అపురూపమైన కథ ఇక్కడ చదవండి.

పొగబండి కథలు                      పేజీలు 120, ధర : అరవైరూపాయలు
విశాలాంధ్ర, నవయుగ బుక్‌ హౌస్‌, నవోదయ బుక్‌ హౌస్‌, క్రియేటివ్‌ లింక్స్‌ పబ్లికేషన్స్‌లో దొరుకుతోంది. ప్రవాసాంధ్రులు నేరుగా రచయితనో, ప్రచురణకర్తలనో సంప్రదించవచ్చు.
రచయిత చిరునామా
Voleti SrinivasaBhanu

206-B, Surya towers, Bhavani Nagar, Malkajgiri, Hyd 500047.

mobile 9440567151, email : bhanuvoleti@yahoo.co.in

ప్రచురణకర్తలు

Creative Links, Ph 9848065658, 98485 06964

creativelinkspublications@yahoo.com

2 thoughts on “కూ… చుక్‌చుక్‌… పొగబండి కథలు

  1. I feel it a great honour to have my book Pogabandi Kathalu introduced on this page. My sicere thanks to Arunima.

  2. పాతకాలంలో పొగబండి లో ప్రయాణాన్ని గుర్తుచేసినరు.
    చదవాలి. ఆ “పొగబండి” వారి జీవితాలు తెలుసుకోవాలి.
    బ్రహ్మ కపాలం చదవడానికి మీరిచ్చిన లింక్‌లో scanned copy చదవడానికి అనువుగా లేదు.

    ప్రత్యేకం గా చెప్పుకోవలసింది ఒకటి ఉంది.
    ఇక పుస్తకం అందుకోవడానికి మీరిచ్చిన వివరాలు. అవి మరి కొంత మందిని తెలుగు సాహిత్యానికి దగ్గిర చేస్తే అంతకన్నా కావల్సింది ఏముంటుంది?

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s