The Good man Jesus and the Scoundrel Christ

‘హిజ్‌ డార్క్‌ మెటీరియల్స్‌’తో ప్రసిద్ధుడయిన నవలా ర చయిత ఫిలిప్‌ పుల్‌మాన్‌. ఏసుక్రీస్తుకు సంబంధించిన కథాంశంతో ఆయన రాసిన ‘ద గుడ్‌ మేన్‌ జీసస్‌ అండ్‌ ద స్కౌండ్రల్‌ క్రైస్ట్‌’ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ పుస్తకం చర్చి పట్ల రచయిత ధిక్కారమా లేదా ప్రాచుర్యంలో ఉన్న కథలోని వాస్తవాలను మరోసారి పరిశీలించాలనే నిజమైన ఆసక్తా అనేది విమర్శకులకే అంతుపట్టడంలేదు.

‘ఒక రహస్య దేవత వరంతో మేరీ కన్నది ఒక శిశువును కాదు, జీసస్‌ – క్రైస్ట్‌ అనే కవలలను’ అంటూ మొదలయే ఈ పుస్తకం అందరినీ విస్మయపరుస్తోంది. కల్పిత కథ అంటూనే చారిత్రక వాస్తవాల మీద ఆధారపడుతున్నట్టు చెప్పిన రచయిత గడుసుతనం కూడా చదువరులను ఆశ్చర్యపరుస్తోంది. కథ సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే – క్రైస్ట్‌కు తన కవల సోదరుడు జీసస్‌ పట్ల అమితమైన ప్రేమ. జీసస్‌ను అనుసరిస్తూ, అతను సమస్యల్లో ఇరుక్కున్నప్పుడల్లా రక్షిస్తుంటాడు. జీసస్‌ మాటలంటే అతనికి చాలా నమ్మకం. దాంతోటే అతని ప్రతి ఉపన్యాసాన్నీ జాగ్రత్తగా భద్రపరుస్తుంటాడు. కానీ జీసస్‌కు మాత్రం క్రైస్ట్‌ పట్ల సద్భావం ఏమీ లేదు. అతను పిల్ల తరహా అని, దుడుకుపనులు చేస్తుంటాడని అనుకుంటాడు. క్రైస్ట్‌ భద్రపరిచిన జీసస్‌ మాటలే పవిత్ర ప్రవచనంగా చెలామణీలోకి వచ్చాయని, వాటిలో జీసస్‌ చేసిన అద్భుతాలుగా పేర్కొన్నవేవీ నిజానికి దైవకృప వల్ల సంభవించినవి కావని, అవన్నీ అప్పటి ప్రజలు కల్పించినవేనంటాడు రచయిత ఈ పుస్తకంలో. వాటిని అలా చిత్రించడానికి జీసస్‌ పన్నెండు మంది శిష్యులూ క్రైస్ట్‌కు సహకరించేవారని పుల్‌మాన్‌ వాదన. పవిత్ర ప్రవచనాల్లో పదేపదే కనిపించే ‘దేవుని రాజ్యం’ అన్న మాట భవిష్యత్తు మీద మానవాళికి ఆశ కలిగించడానికి జీసస్‌ వాడిన మాట అని, చివర్లో క్రైస్ట్‌ పన్నిన కుట్ర ఫలితంగా జీసస్‌ మృత్యువు సంభవించిందని ఈ కథనం చెబుతోంది. ఇంకా భారతీయ మార్కెట్లో విడుదల కాని ‘ద గుడ్‌ మేన్‌ జీసస్‌ అండ్‌ ద స్కౌండ్రల్‌ క్రైస్ట్‌’ పుస్తకాన్ని ఏసుక్రీస్తు భక్తులు, సాహిత్య లోకం, విమర్శకులు ఎన్ని కోణాల్లో చూస్తున్నారో, ఎన్ని వివాదాలు రేగుతున్నాయో ఇంకొంత కాలం గడిస్తేగానీ తెలియదు. పుస్తకంలో కొన్ని భాగాలు గార్డియన్లో ఇక్కడ క్లిక్ చేసి చదవొచ్చు.

12 thoughts on “The Good man Jesus and the Scoundrel Christ

 1. పుస్తకాలు అమ్ముకోవాలి అంటే ఏదో ఒక వివాదస్పదమైన అంశం పైన రాయాలి లేదా అందరూ నమ్మినదాన్ని వివాదస్పదం చేయాలి. ఇది విదేశీ రచయితలకు అలవాటైయినదే.

 2. ఒక ద్రౌపది కి ఒక సౌశీల్య ద్రౌపది, ఒక విష వృక్షానికి ఒక కల్పవృక్షం వ్రాసుకుంటారు. అలాగే ఈ స్కౌండ్రల్‌ క్రైస్ట్ కి కూడా మరొకరు వ్రాయవచ్చు. కాసేపు చదువుకోడానికి బాగానే ఉంటాయి!

  • కాసేపు చదువుకోవడానికి… నిజమే. 499 పేజీల పుస్తకం చదవడానికి నాలుగు రోజులైనా పట్టదు. ముఖ్యంగా ఈ పుస్తకం.

 3. ఒకరి నమ్మకాలను అపహాస్యం చేసి పేరు తెచ్చుకోవాలనుకోవడం మంచిదేనా?

  • రాఘవ్,
   ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రతి మంగళవారం కొత్త ఇంగ్లిషు పుస్తకాలను పాఠకులకు పరిచయం చేసే శీర్షిక ఉంది. దానిలో నిన్న పరిచయమైనదీ పుస్తకం. ‘నమ్మకాలను అపహాస్యం చేసి పేరు తెచ్చుకోవడం’ అంటారా, అది ఆయా రచయితలెంచుకున్న తీరు.

 4. బ్లాగుల రేట్ పెంచుకునేందుకు వివాదాస్పద పోస్టులు రాసినట్లే ఇవి కూడా. జీసస్ చెప్పిన దైవ రాజ్యమైనా ఏమైనా ఆనాటి సామాన్య మానవులకు తమ వెతలను౦డి విముక్తిపై ఆశను కలుగచేయడమే. మార్క్స్ కాక్శి౦చిన సమ సమాజం కూడా. భవిష్యత్తుపై నమ్మకం కలగజేయడానికే. రేపు తెల్లరుతు౦ద౦టేనే రాత్రి నిద్దుర పట్టేది. కాద౦టారా?

 5. అరే..మీరేనా? తెలియలేదండి..ఇన్నాళ్ళూ…సాహితి బ్లాగ్లో సిరిసిరిమువ్వగారు ఇచ్చిన లింక్ చూసి ఇటు వచ్చాను…చాలా సంతోషం..!!

 6. హిస్టారికల్ పల్ఫ్ ఫిక్షన్ ఒక తరహా ప్రక్రియ. దానికి అనవసరమైన విలువలు ఆపాదించాల్సిన అసరమూ లేదు. బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. just read and trash it అంతే…

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s