పులస కోసం అన్వేషణ

samanth subramanianఫాలోయింగ్‌ ఫిష్‌ – ట్రావెల్స్‌ అరౌండ్‌ ద ఇండియన్‌ కోస్ట్‌

రచయిత : సామంత్ సుబ్రమణియన్
పేజీలు : 167 ధర : 250రూ.
ప్రచురణ : పెంగ్విన్‌

‘అనగనగా రాజుగారు, ఆయనకు ఏడుగురు కొడుకులు.. వాళ్లు చేపలు తెచ్చారు. వాటిల్లో ఒకటి ఎండలేదు…’
మనకు చిన్నప్పుడు పరిచయమయ్యే ఐదు కథల్లో ఈ కథ తప్పకుండా ఉంటుంది. అలా చేపలూ పరిచయమవుతాయి. మూడువైపులా సముద్ర తీర ప్రాంతం, దానికితోడు లెక్కలేనన్ని నదులు, జల వనరులూ ఉన్న భారత్‌ వంటి మత్స్య సంపదకేం లోటు లేదు. దానిమీద ఆధారపడిన  మనుషులూ, వాణిజ్యమూ.. చెప్పుకొంటూ పోతే చాలానే. వీటిలో కొన్ని కోణాలను పరిచయం చేస్తుంది ‘ఫాలోయింగ్‌ ఫిష్‌ – ట్రావెల్స్‌ అరౌండ్‌ ద ఇండియన్‌ కోస్ట్‌’ పుస్తకం. దీని రచయిత సామంత్‌ సుబ్రమణియన్‌ పాత్రికేయుడు. అంతర్జాతీయ సంబంధాల్లో కొలంబియా యూనివర్సిటీనుంచి పట్టభద్రుడైన సామంత్‌ భారతదేశ తీర ప్రాంతాల్లో తిరిగి, తాను దర్శించిన కోస్తా జీవనాన్ని వైవిధ్యంగా అక్షరబద్ధం చేశారు. పాత్రికేయ కోణం నుంచి రాయడంతో ఈ పుస్తకం కేవలం యాత్రా కథనాల్లా వివరాలను అందించి ఊరుకోదు. చేపలను పట్టడం, అమ్మడం, చేపలు పట్టే పడవలను నిర్మించడం, రకరకాల వంటకాలు తయారుచెయ్యడం… ఇలా చేపలతో దైనందిన జీవితాన్ని ముడిపెట్టుకున్న జనాల సామాజిక ఆర్థిక సాంస్కృతిక కోణాలను చూపిస్తూ సాగుతుందీ పుస్తకం. మొత్తం తొమ్మిది వ్యాసాల్లో మన హైదరాబాద్‌ చేపమందు గురించి కూడా ఒక వ్యాసం ఉంది. ఈ పుస్తకం నుంచి కొంత అనువాదం..

“నేను కోల్‌కతా చేరుకోడానికి ముందురోజే అక్కడి బుర్రాబజార్‌లో నిప్పంటుకుంది. నందరామ్‌ మార్కెట్‌  సముదాయంలోని పద్నాలుగు అంతస్తులతో పాటు, వాటి చుట్టుపక్కల దుకాణాలను అగ్ని పూర్తిగా దహించేసింది. నేనొచ్చిన రోజు సాయంత్రం కూడా పొగ గాలిలో గింగిరాలు తిరుగుతున్నట్టే అనిపించింది నాకు. ఓ భవనం మీద ఆకుపచ్చని అక్షరాలతో రాసిందేమిటో కూడా తెలియకపోవడానికి కేవలం ట్రాఫిక్‌ పొగ ఒక్కటే కారణం కాదనిపించింది. తాజా పొగ ఆచూకీ నాకు తెలుస్తూనే ఉంది. తర్వాత తెలిసింది – బ్యాడ్మింటన్‌, కుక్కలను తిప్పడం వంటివాటిలాగే శీతకాలం సాయంత్రాలు ఆకులను తగలబెట్టడం అక్కడివారికి కాలక్షేపం అని, నాకు వచ్చిన పొగ అదేనని నా మిత్రుడి తండ్రి చెప్పారు. (ఇంతకీ తెల్లటి బోర్డు మీద రాసిన ఆకుపచ్చ అక్షరాలు కాలుష్య మండలి భవనం బోర్డును సూచిస్తున్నాయి)

పచ్చదనానికి పొగబెట్టడం నచ్చకపోయినా కోల్‌కతాను సందర్శించడానికి శీతకాలమే అన్నిటికన్నా అనువైనదని నాకు నమ్మకంగా తె లిసింది. మరీ అంత వేడిగానో, మరీ అంత చల్లగానూ కాకుండా తేమలేకుండా, మరీ పొడిగా కాకుండా హాయిగా ఉంటుంది. కోల్‌కతా ప్రమాణాల ప్రకారం చూసుకున్నా, జీవన వేగం కాస్త మందగించే కాలం అది. ట్రాఫిక్‌ పెద్దగా ఉండదు, పుచ్కాలు బావుంటాయి. ఒక్క పులస చేపను తినడానికి మాత్రం ఇది కాలం కాదని నాకు చెప్పారు. తీరా, నేను చెయ్యాలనుకున్న పని అదే! కోల్‌కతా నేనూ భిన్నధృవాలం అనిపించింది. అక్కడ కలిసిన ప్రతివారూ, పులస తినాలనుకుంటే వర్షాకాలంలో మరోసారి రమ్మని అన్నారు. ఇప్పుడు దొరకవు, దొరికినా తినడానికి బాగుండవు. అదీ వారి మాటల సారాంశం. కొంచెం ఓపిక పట్టి వర్ష ఋతువులో వస్తే మంచిది. పులస వెనక ఒక నీతి కూడా ఉంది. సహనం వహించినవారికే మంచి వస్తువులు లభ్యమవుతాయి.
సంప్రదాయవాదులను పక్కకు పెడితే కోల్‌కతాలో జాలర్లకు, చేపల వర్తకులకు మాత్రం నీతుల కన్నా పులసలే ఎక్కువ ఆకర్షణీయంగా తోచినట్టున్నాయి. జనవరి నెల మధ్యలో కూడా నే చూసినచోటల్లా పులసలు దొరుకుతూనే ఉన్నాయి. అన్ని రెస్టరంట్లలోనూ వండుతూనే ఉన్నారు, బంగ్లాదేశ్‌నుంచి ట్రక్కులుట్రక్కుల పులసలు వచ్చి పడుతూనే ఉన్నాయి, నదుల పక్కన చిన్న హోటెళ్లలో దొరుకుతోంది, చేపల బజార్లలో కుప్పలుతెప్పలు. మంచి వస్తువులు జేబులో అరవై రూపాయలున్నవాడికి లభ్యమవుతాయని అర్థమైంది. మొత్తానికి ఆకుల పొగ నుంచి తేరుకున్న మూడు గంటల్లోపే నేను అన్నం చేపకూరా ఉన్న కంచం ముందు కూచున్నాను.

బెంగాలీ ఆహారం కనుక వింబుల్డన్‌ అయితే, అందులో పులస సెంటర్‌కోర్ట్‌లో ఆటలాంటిది. భారత్‌లో ఈ భాగంలో ఇది ఎదురులేని విజేత. అద్భుతమైన రుచి, కేవలం ఒక సీజన్‌లోనే దొరికే చేపన్న ప్రతిష్ఠల వలన దీన్ని మరీమరీ కోరుకుంటారు. కవులు దీని మీద కవిత్వమే రాశారు! పులసకు ఏకంగా ‘జల ప్రేయసి’గా బిరుదునిచ్చేశారు. బెంగాలీ గుర్తింపుకే పులస చిహ్నం అనుకోవచ్చు. తూర్పు – పశ్చిమ బెంగాల్లో మాత్రం అన్నదమ్ముల వైరంలాంటి ఒక తేడా ఉంది. తూర్పు బెంగాల్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ గెలిచినప్పుడు అభిమానులు పులస చేపతో డిన్నర్‌ చేసుకుంటారు. మోహున్‌ బగాన్‌ వాళ్లు మాత్రం రొయ్యలతో పండగ చేసుకుంటారు. దాదాపు ప్రతి చేపల మార్కెట్లోనూ పులసను రుచి చూడమంటూ దుకాణదారులు పెద్దగా పిలుస్తుంటారు కొనేవాళ్లని. చేపల మార్కెట్‌ అనగానే చెన్నైలోని మా స్కూల్లో టీచర్లు గద్దించిందే గుర్తుకొస్తుంది నాకు. ఆ టీచర్లలో చాలామంది చేపల మార్కెట్‌కు వెళ్లి ఉండరేమో.

Advertisements

4 thoughts on “పులస కోసం అన్వేషణ

    • ‘కదా’ అంటే ఏమన్నమాట? నేను తిననుగనుక వాటి రుచి నాకు తెలియదు. సరస్సుల్లో ఈదులాడుతున్నప్పుడు చూడటానికి మాత్రం బాగుంటాయి. 😛

  1. మీ బ్లాగ్ ఈరోజే చూశాను చాలా బాగుంది. తీరిగ్గా మిగిలిన టపాలు చూస్తాను.

  2. ‘కదా’ అంటే ఏమన్నమాట? నేను తిననుగనుక వాటి రుచి నాకు తెలియదు. సరస్సుల్లో ఈదులాడుతున్నప్పుడు చూడటానికి మాత్రం బాగుంటాయి.
    ///

    haha 😛

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s