ఒక రోజా కోసం

ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో… 36 భాషల్లోకి అనువాదమయిన నవలంటే చదువరులకు
ఆసక్తి లేకుండా ఉంటుందా? అందులోనూ ఇరవైఎనిమిదేళ్ల యువకుడు రాసిన తొలి నవలే అంత ప్రాచుర్యానికి నోచుకుందంటే ఆసక్తి రెట్టింపవుతుంది. అలాంటి ఆసక్తే సెర్దెర్‌ ఓజ్‌కాన్‌ రాసిన ‘మిస్సింగ్‌ రోజ్‌’ను ‘ఒక రోజా కోసం’గా తెలుగులోకి తీసుకొచ్చింది. ఓర్హన్‌ పాముక్‌, యాసర్‌ కెమాల్‌ తర్వాత ఇటీవలి కాలంలో అంతగా పేరుప్రఖ్యాతులు పొందిన టర్కీ దేశపు సాహిత్యకారుడు సెర్దెర్‌ మాత్రమే. పాలో కొయిలో ‘ఆల్కెమిస్ట్‌’ తరహాలో దీన్ని ఆదరిస్తున్నారు పాఠకులు.

‘ఒక రోజా కోసం’ కథలోకి వస్తే

డయానా స్వతహాగా బలహీన మనస్కురాలు. ఎప్పుడూ ఇతరుల మెప్పుకోసం పరితపించిపోయే ఆ పిల్ల రచయిత్రినవ్వాలన్న తన కలను వదిలేసుకుని స్నేహితుల మాటల్లో పడి న్యాయవాది అవాలనుకుంటుంది. మనసు చెప్పే మాటలను నిర్లక్ష్యం చేసే ఆమె ఒక స్థాయిలో ఏమీ పాలుపోని దశకు చేరుకుంటుంది. తల్లి మరణించినప్పుడు తనకు మేరీ అనే కవల సోదరి ఉన్నట్లు తెలుసుకుంటుంది డయానా. మేరీ తల్లికి రాసిన నాలుగు ఉత్తరాల ఆధారంగా ఆమెను వెతుకుతూ ఇస్తాంబుల్‌ నగరానికి చేరుకుంటుందామె. మేరీ ఆచూకీ కనుక్కోవడం ఒక్కటే కాకుండా, గులాబీల భాష నేర్చుకోవడం అన్న మరో గమ్యం కూడా ఉంది డయానాకి. మొత్తమ్మీద ప్రయాణం పూర్తయ్యేసరికి డయానా తన లోపలి వెలుగును గుర్తిస్తుంది. ఎప్పుడూ తన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని ఆలోచించకుండా ఉండటం నేర్చుకుంటుంది.

మన హృదయం ఏం చెబుతుందో, దేనిలో ఆనందం దొరుకుతుందో… దాన్ని వెతుకుతూ సాగిపొమ్మనే ‘ఆల్కెమిస్ట్‌’ వంటి పుస్తకాల సరసన చేరుతుంది ‘ఒక రోజా కోసం’ కూడా. కేవలం కథనే పైపైన చదివి వదిలేస్తే చెప్పుకోడానికేమీ ఉండదు. ‘ఒక రోజా కోసం’ డయానా ప్రారంభించిన వెతుకులాట – మన అంతర్లోకాల్లో నిత్యం చేస్తున్న ప్రయాణం. తనలోకి తాను తొంగిచూసుకోవడం, ఆనందాన్ని వెతుక్కోవడం – ఈ రెండూ నిరంతర ప్రయాణాలు. పరుగుల జీవితంలో మాయమైపోతున్న ‘ఆత్మ’ను కనుక్కోవడానికి చెరొకటీ దారి. ఆ దారిలో వెళుతున్నప్పుడు ఆటంకాలు ఎదురవడమూ సహజమే. వాటిని అధిగమించమని స్ఫూర్తినిచ్చే పుస్తకం ‘ఒక రోజా కోసం’. నవల ఆద్యంతమూ ఆపకుండా చదివిస్తుంది. అనువాదం సరళంగా సాగింది.

‘ప్రేమికులను ప్రేమ తక్కువ చెయ్యదు. నిజానికది వారిని ఉన్నతులుగా చేస్తుంది’

‘మనందరం కూడా ఇతరుల ఆమోదం కోసం మనలోని కొంత భాగాన్ని త్యాగం చేస్తుంటాం’

‘బాగున్నదానిని వదిలిపెట్టే ధైర్యమున్నవాళ్లే అంతకంటే మెరుగైనదాన్ని అందుకోగలరు’ వంటి వాక్యాలు ‘కోటబుల్‌ కోట్స్‌’గా గుర్తుండిపోతాయి.

ఒక రోజా కోసంGet Shortlink
అనువాదం : కె. సురేష్‌
పేజీలు : 176, ధర : 100రూ.
ప్రతులకు : మంచిపుస్తకం, 12-13-450, తార్నాక వీధి నెం 1, సికింద్రాబాద్‌ 500017,
నవోదయ బుక్‌ హౌస్‌, కాచిగూడ, హైదరాబాద్‌.

4 thoughts on “ఒక రోజా కోసం

 1. థాంక్స్ అండీ..
  మీరు ఇక్కడ ఇలా రాసి ఉండకపోతే…నేను ఈ బుక్ మిస్ అయి వుండే వాడిని.
  థాంక్స్
  రాము
  apmediakaburlu.blogspot.com

 2. అరుణ గారూ,
  ఈ వారం సారంగలో ఒక రోజా కోసం నవలని పరిచయం రాశాను. చూడండి సమయం చూసుకుని. దీని గురించి ఎవరైనా review రాశారా అని google లో వెతుకుతుంటే మీరు దొరికారు. అరుణ గారూ చదివి మీ అభిప్రాయం రాయండి.
  regards
  Radha

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s