శాస్త్రవేత్తలవుతారా? ఇదిగో దారి…

కేంద్ర ప్రభుత్వంలోని శాస్త్ర సాంకేతిక విభాగం (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ) కొత్తఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఆ విభాగం రూపొందించిన ‘విమెన్‌ సైంటిస్ట్‌ స్కీమ్‌’ విజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసించిన మహిళల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. ఈ పథకాన్ని ఉపయోగించుకుని 28 – 50 మధ్య వయసున్న పట్టభద్రులయిన స్త్రీలు ఎవరైనా సరే తమ పైచదువులను కొనసాగించవచ్చు. ఇంజినీరింగ్‌ లేదా ఇతర సైన్స్‌ విభాగాల్లో (గణితం చదువుకున్నవారికీ అవకాశం లేదు) పట్టా పుచ్చుకుని కొంత కాలం ఉద్యోగమో మరోటో చేసి వివిధ కారణాల వల్ల విరామం వచ్చినవారికి ఇది గొప్ప అవకాశం. తమ ఆలోచనకు పదునుపెట్టి చేద్దామనుకుంటున్న ప్రాజెక్టును నిపుణుల బృందం ముందు వివరించాలి. వారికి నచ్చితే ఆ ప్రాజెక్టును శాస్త్రసాంకేతిక విభాగానికి పంపుతారు. అక్కడ ఆమోదం లభిస్తే చాలు – పరిశోధనకు మార్గం సుగమమైనట్టే. ఇంజినీరింగ్‌ లేదా ఎమ్మెస్సీ డిగ్రీ ఉన్నవారికి నెలకు ఇరవై వేల రూపాయలు, ఎంటెక్‌ ఉంటే 35 వేల రూపాయల ఉపకార వేతనం మంజూరవుతుంది. ఇదిగాక మూడేళ్ల పరిశోధనకయ్యే పరికరాలకు, ప్రయాణాలకు దాదాపు నాలుగైదు లక్షల రూపాయలను శాస్త్రసాంకేతిక విభాగమే అందిస్తుంది. పరిశోధనకు సహకరిస్తున్న సంస్థలకు విడిగా పదిహేను శాతం ఖర్చులకోసం ఇస్తారు. మహిళలు ఈ ప్రాజెక్టునే పక్కాగా రూపొందించి పీహెచ్‌డీ పట్టా కూడా పొందే సౌలభ్యం ఉంది. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేసి చదవండి. ‘మహిళా శాస్త్రవేత్తల పథకం’లో భాగంగా ప్రాజెక్టులు చేస్తున్న నలుగురితో మాట్లాడింది ‘నవ్య’. వారి విశేషాలు ఇతర మహిళలకు స్ఫూర్తిదాయకాలు.
—————————-
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో బయోటెక్‌ లెక్చెరర్‌గా పనిచేస్తున్నాను. జీడిపిక్కల వ్యర్థాల నుంచి యాంటీబయాటిక్‌ ఉత్పత్తి అన్నది నా ప్రాజెక్టు.
– లోకేశ్వరి

ఏఎమ్‌ఐఈ తర్వాత ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి ఎంటెక్‌ చేశాను. ఓ ఇంజినీరింగ్‌ కాలేజీలో పనిచేస్తూ పూర్తి స్థాయిలో పీహెచ్‌డీ చేయాలని వస్తే ఈ పథకం గురించి తెలిసింది. వెంటనే ఇందులో చేరిపోయాను. ఎలక్టోమాగ్నటిక్‌ కంపాటబిలిటీ నా అంశం. చుట్టూ ఉన్న వాతావరణంలోని రేడియేషన్ను తగ్గించేట్టుగా యాంటెన్నాలను డిజైన్‌ చేయడం అనేది నా ప్రాజెక్టు.
– రాజ్యలక్ష్మి

విజయవాడ సిద్దార్థలో బీటెక్‌(ఈసీఈ) చేసి ఏయూలో ఎంటెక్‌ చేశాను. ఉద్యోగం చేస్తుండగా మహిళా శాస్త్రవేత్తల పథకం గురించి తెలిసింది. ‘వర్సటైల్‌ సిగ్నల్‌ జెనరేటర్‌ ఇన్‌ రాడార్‌ అండ్‌ సోనార్‌ పల్స్‌ కంప్రెషన్‌ కోడ్స్‌’ అంశం మీద ప్రాజెక్టు చేస్తున్నా.
– నాగజ్యోతి

కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులో ఇంజినీరింగ్‌, అవంతీ కాలేజీలో ఎంటెక్‌ చేశాను. రెండుమూడేళ్లు పనిచేసిన తర్వాత పీహెచ్‌డీ అడ్మిషన్‌ కోసం విశ్వవిద్యాలయానికి వెళ్లినప్పుడు రాజేశ్వరిగారు ఈ స్కీమ్‌లో చేరమని ప్రోత్సహించారు. ‘రోబస్ట్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ ఫర్‌ రాడార్‌ అండ్‌ సోనార్‌ అప్లికేషన్స్‌’ అనేది నేనెన్నుకున్న అంశం.
– కుసుమకుమారి

Advertisements

One thought on “శాస్త్రవేత్తలవుతారా? ఇదిగో దారి…

  1. ఉద్యోగం కోసం చదువు, తరువాత పెళ్ళీ, ఆనాక పిల్లలు, పెనిమిటి తన కుటుంబం వరకే పరిమితం అనుకున్నాం ఇంతవరుకు. ఈ పథకంతో దానిని కొంత మేరకు నియంత్రించినట్టే. బాగుంది మీ ప్రయత్నం. ఈ పధకానికి మరింత ప్రాచుర్యం కలిపించాలి. సాధ్యమైనంత మంది ఇందులో పాల్గొనాలి.

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s