సేద్యం కోసం ఇండియా వచ్చేసింది

మనం అభివృద్ధిని సాధించామో లేదో తెలియాలంటే తప్పకుండా పోల్చి చూసుకోవాలి- ఇతరులతో కాదు, మనసు మనతోనే, పోలికైనా పోటీయైనా మనతో మనకే, అప్పుడే ముందడు గేస్తాం. ఇలా ఆలోచించిన పాతూరి క్రాంతి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలేసి విజయనగరం దగ్గర పల్లెలో వ్యవసాయం మొదలుపెట్టారు. రెండేళ్లుగా చేస్తున్న కృషికి ప్రోత్సాహంగా ఈ మధ్యే ‘రైతునేస్తం’ పురస్కారాన్ని అందుకున్నారు.

“మన దేశంలో వ్యవసాయదారులు పెద్దగా చదువుకున్నవాళ్లు కాదు. బాగా చదువుకున్నవాళ్లెవరూ వ్యవసాయం చెయ్యరు. ఎందుకంటే అందులో లాభాల్లేవు గనుక. ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినప్పుడే వ్యవసాయం లాభసాటిగా తయారవుతుంది. దానికోసమే విద్యావంతులు సైతం పొలంలోకి దిగాలి. నాగలి పట్టాలి…” అంటున్న క్రాంతి ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. అలాగని ఆమె వ్యవసాయదారుల కుటుంబంలో పుట్టలేదు, దానికి సంబంధించినదేమీ చదవలేదు. విశాఖపట్నంలో బీఎస్సీ డిగ్రీ పూర్తిచేసేనాటికి ఆమె కళ్ల నిండా డాలర్ కలలే ఉండేవి. అప్పటికే ఆ దారిలో నడుస్తున్న ప్రదీప్‌తో పెళ్లయి అమెరికా విమానం ఎక్కేసినప్పుడు చాలా సంబరపడ్డారామె. “మొదటిసారి విమానం ఎక్కినప్పుడు, అమెరికాలో వాలిపోయినప్పుడు భలే గొప్పగా అనిపించింది. సినిమాలు, షికార్లు – రెండేళ్లు బాగా ఎంజాయ్ చేశాం. పిల్లలు, బాధ్యతలు పెరుగుతున్నకొద్దీ సంపాదన పెంచుకునే పనిలో పడ్డాం. పదేళ్లలో ఇక్కడికి తిరిగి రావాలన్న ఆలోచనే కలగలేదు..” అంటున్న క్రాంతికి తమ్ముడి పెళ్లి సందర్భంగా ఎదురయిన సంఘటనలు ఆ ఆలోచనని కలిగించాయి.

వాళ్లకి తెలియాలని…
“తమ్ముడి పెళ్లి సందర్భంగా ఇక్కడికొచ్చాం. అప్పటికి మా ఇద్దరబ్బాయిలూ కాస్త పెద్దవాళ్లయ్యారు. అయితే వాళ్లకెవరూ తెలీదు. బంధాలూ బంధుత్వాలూ ఏమీ తెలియవు. ఒకపూట తినడానికి లేనివారున్నారంటే ఆశ్చర్యపోయేవాళ్లు. ఇంట్లో పనివారిని చూసి విసుక్కునేవాళ్లు. ఆహారాన్ని వృధా చెయ్యొద్దంటే వింతగా చూసేవారు. కంచంలోకి అన్నమెలా వస్తోందో, కూరగాయలెలా పండుతాయో వాళ్లకేమీ తెలీదు. వాళ్లకి అర్థమయ్యేలా చెబుదామంటే – నాకు మాత్రం ఏం తెలుసు? ఎంత తెలుసు?” వాటికి సమాధానాలను వెతుకుతూనే తొలి అడుగు వేశారామె. ఎనిమిది నెలల పాటు తన ముందున్న మార్గాల్లో మంచీచెడూ బేరీజు వేశారు. తనకి చేతి నిండా పనుండాలి, అది మరో పదిమందికి జీవనాన్నివ్వాలి, సమాజానికి మేలు జరగాలి, తమ పిల్లలకు నాలుగు విషయాలు నేర్పగలగాలి – ఇదీ క్రాంతి లక్ష్యం. తల్లి వారించినా తండ్రి, భర్త ఆమెకు ప్రోత్సాహాన్నిచ్చారు. విజయనగరం జిల్లా రామభద్రపురం దగ్గరున్న ఇట్లామామిడిపల్లి గ్రామ సమీపంలో తండ్రికున్న 32 ఎకరాల భూమిని సాగులోకి తేవడం తన ధ్యేయంగా పెట్టుకున్నారామె. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆమె కుటుంబం అమెరికా నుంచి విశాఖపట్నానికి వచ్చేసింది.

తుప్పల్ని కొట్టి, పొలాల్ని పెట్టి…
క్రాంతి ఎంచుకున్నది పూర్తిగా వర్షాధార నేల. నీటివసతి అన్నదే లేదు. ఎనిమిది ఎకరాల్లో సరుగుడు తోట ఉండేది. మిగిలిందంతా ముళ్ల తుప్పలే. ఏడాదికి ఎనిమిదేసి ఎకరాల చొప్పున సాగులోకి తీసుకురావాలని క్రాంతి ఆలోచన. ఇప్పటికి పదహారెకరాలకు డ్రిప్ ద్వారా నీటినందిస్తూ పత్తి, వరి, మొక్కజొన్న… తదితర పంటలను వేశారు. చాలావరకూ సేంద్రియ విధానంలోనే వ్యవసాయాన్ని సాగిస్తున్నారు. “ఊళ్లో అందరికంటే మా పొలమే పల్లంలో ఉంది. ఎవరు రసాయనిక ఎరువులు వాడినా వాటి ప్రభావం మాకూ కొంత సోకక తప్పడం లేదు. అందుకని పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నానని చెప్పను…” అంటున్న క్రాంతి ఒక మూడెకరాల్లో ఈము కోళ్ల పెంపకాన్నీ చేపట్టారు. “సరుగుడు దానంతటదే పెరుగుతుంది. స్థానికులకు ఉపాధి ఏది? అందుకే దాన్ని కొట్టేసి ఆ భూమిలో కూరగాయలను పండిస్తున్నాం. ఈ రెండేళ్లలో నన్ను చూసి మా చుట్టుపక్కల కూరగాయలు పెట్టారు.” ఇప్పుడు ఆమె పొలంలోనే ఇల్లూ కట్టుకున్నారు. నాగలి, పార, కొడవలి లాగానే, ల్యాప్‌టాప్, ఇంటర్నెట్, టీవీ, సెల్‌ఫోన్ తదితర ఆధునిక ఉపకరణాలు కూడా క్రాంతికి వ్యవసాయంలో సాయం చేస్తున్నాయి. నాణ్యత, దిగుబడి మీద శ్రద్ధ పెట్టిన ఆమె “నా సేద్యం లాభాల బాట పట్టడానికి మరో మూడేళ్ల సమయమైనా పడుతుంది. ప్రస్తుతానికి సగటున రోజుకు 22మందికి పని కల్పించగలుగుతున్నందుకు సంతోషంగా ఉంది..” అన్నారు. ఆ సంతోషానికి ప్రోత్సాహంగానే ‘రైతునేస్తం’ అవార్డునూ అందుకున్నారామె.

వారం పాటు వ్యవసాయం…
రెండేళ్లు మన్నులో మన్నయి కష్టపడితేనే ఆమెకు ఇదంతా సాధ్యమయింది. సోమవారం ఉదయం పిల్లలు స్కూలుకు వెళ్లిన తర్వాత విశాఖపట్నంలో బస్సెక్కి వంద కిలోమీటర్ల దూరంలోని పొలానికి చేరుకుంటారామె. ఐదు రోజుల పాటు వ్యవసాయప్పనులు చూసుకొని తిరిగి శుక్రవారం రాత్రికి నగరంలోని ఇంటికి వచ్చేస్తారు. సెలవులున్నప్పుడల్లా పిల్లల్నీ తనతో పాటు తీసుకెళుతుంటారు. దీనివల్ల వారికి పల్లెటూళ్లు, ఆర్థిక తారతమ్యాలు,వివిధ ఆహారపుటలవాట్లు వంటివి బాగా అర్థమవుతున్నాయట. “వాటెవర్ గ్రోస్ ఇన్ టూ మంత్స్, వుయ్ ఈట్ ఇన్ జస్ట్ టూ మినిట్స్. అందుకే ఫుడ్ వేస్ట్ చెయ్యకూడదు…” అంటున్నారట వాళ్లు. అంటే క్రాంతి ప్రయత్నం కొంత ఫలించినట్టే. “పిల్లలకు వివరించడానికి మొదలుపెట్టి ఎన్నో విషయాలు తెలుసుకున్నాన్నేను. ఇంకా పెద్ద ప్రయాణమే ఉంది ముందుముందున…” అంటున్న ఆమెను చూస్తే వ్యవసాయం మీద, రైతు బతుకు మీద చిన్న ఆశ లాంటిదేదో కలుగుతుంది ఎవరికైనా.

తనకి చేతి నిండా పనుండాలి, అది మరో పదిమందికి జీవనాన్నివ్వాలి, సమాజానికి మేలు జరగాలి, తమ పిల్లలకు నాలుగు విషయాలు నేర్పగలగాలి – ఇదీ క్రాంతి లక్ష్యం. తల్లి వారించినా తండ్రి, భర్త ఆమెకు ప్రోత్సాహాన్నిచ్చారు. విజయనగరం జిల్లా రామభద్రపురం దగ్గరున్న ఇట్లామామిడిపల్లి గ్రామ సమీపంలో తండ్రికున్న 32 ఎకరాల భూమిని సాగులోకి తేవడం తన ధ్యేయంగా పెట్టుకున్నారామె.

Advertisements

4 thoughts on “సేద్యం కోసం ఇండియా వచ్చేసింది

  1. Pingback: శ్రమ విలువను గుర్తించిన మేధావి ఆమె « జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

  2. very interesting and chandrababu naidu should read this who discouraged agriculture but now says that he did not do it.

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s