అభిమానమే ఆహ్వానంగా వచ్చినప్పుడు…

అసలేం జరిగిందంటే – నా కథల పుస్తకం చందనపు బొమ్మ ఆవిష్కరణ

ఎప్పుడంటే – కిందటేడు అదేనండీ 2012 డిసెంబరు 28 న తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగింది.

ఎవరెవరు వచ్చారంటే – శ్రీయుతులు – ‘నవ్య’ వారపత్రిక ఎడిటరు జగన్నాథశర్మ, ఆంధ్రజ్యోతి తిరుపతి ఇన్ఛార్జ్ ఆరెమ్ ఉమామహేశ్వర్రావు, ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసరు కథకులు మధురాంతకం నరేంద్ర, విజయవాడ శ్రీశ్రీ ప్రచురణల విశ్వేశ్వర్రావు, ‘మిధునం’ రచయిత శ్రీరమణ, జంపాల చౌదరి, డాక్టర్ మల్లెమాల వేణుగోపాలరెడ్డి, డాక్టర్ చిల్లర భవానీదేవి, సినీగీత రచయిత్రి రాణి పులోమజాదేవి, కథకులు పలమనేరు బాలాజీ, కవి సిరికి స్వామినాయుడు, కినిగె నుంచి చావా కిరణ్, అనిల్ అట్లూరి, రహ్మానుద్దీన్ షేక్ లతో పాటు సురేశ్ కొలిచాల, తిరుపతికి చెందిన కోట పురుషోత్తం, కాకినాడ నుంచి కవి అద్దేపల్లి రామ్మోహన్, కథాజగత్ కోడిహళ్లి మురళీమోహన్ వంటి పెద్దపెద్ద వాళ్లంతా వచ్చి ఆశీర్వదించారు. అభిమానమే ఆహ్వానంగా ఇంకా చాలామంది వచ్చారు. వాళ్లందరినీ చూసి మనసు సంతోషంలో తేలిపోయిందంతే.

ఇప్పటివరకూ అమ్మాయిగారు పని ఒత్తిడిలో ఉండి పుటోలు పెట్టలేకపోయారన్నమాట.  ఆలస్యాన్ని మన్నించండి.

మొదటి ఫోటో – సభకు ఆహ్వానం పలుకుతున్న పుస్తక ప్రచురణకర్త అబ్బిగారి రాజేంద్రప్రసాద్, రాష్ట్రకథానిలయం అధ్యక్షులు, నందలూరు కడప జిల్లా

ImageImageImage

Image

ImageImageImageImageImageImageImageImage

Advertisements

One thought on “అభిమానమే ఆహ్వానంగా వచ్చినప్పుడు…

  1. ఫుటోలు లేటుగా పెట్టినా లేటెస్ట్ గా పెట్టారు, బావున్నాయి, కాబట్టి మన్నించేశాం. పండగ చేసుకోండి. మీ చందనపు బొమ్మ ఇక్కడెవరికీ అంటే ఈనాడు స్పెషల్ డెస్కులో ఒక్కరంటే ఒక్కరికి కూడా అందలేదు. ఆ ఆలస్యం కూడా పని ఒత్తిడి వల్లే జరిగిందని మన్నించమంటారా? అలా కుదరదంటే కుదరదు. పుస్తకాల టపా ఇక్కడి బట్వాడా అయితే గానీ మిమ్మల్ని మన్నించడం కష్టం. తదుపరి పుస్తకాన్ని మేమే అంటే మీ జర్నలిజం బ్యాచ్ ఫ్రెండ్స్ మే ప్రచురిద్దాం అని ఓ కంకణం కట్టేసుకున్నాం. కాకిరాతలు కాకికి ముద్దు అనే ట్యాగ్ లైన్ చూశాక, బ్యాచ్ మేట్ రాతలు బ్యాచ్ కు ముద్దు అనుకుంటూ అలా డిసైడైపోయామన్నమాట. సో, స్పీడు స్పీడుగా ఓ పాతిక కథలు రాసి హైదరాబాద్ కు విసిరేయండి. బుక్కు అచ్చేసి తిరుగు టపా పంపేస్తాం. ఆవిష్కరణ సభ అక్కడే గుంటూరులో పెట్టేయండి. వై. రమేష్.. వ్యాఖ్యాత. మల్లారెడ్డి.. అధ్యక్షత. స్వాతి.. గౌరవ అతిథి. మిగతా మొత్తం బ్యాచ్ బ్యాచంతా స్పీకర్లే. నేను రిపోర్టింగ్ చేస్తా. 🙂

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s