అంతరంగాల కొమ్మ (21.4.2013 సాక్షి ఫన్ డే సమీక్ష)

పుస్తకం – చందనపు బొమ్మ

రచన – అరుణ పప్పు

ప్రత్యేకత – రచయిత్రి తొలి కథా సంకలనం

కథల గంధం – ఒంటరిగా ఉంటూనే మనల్ని సమూహంలోకి నడిపిస్తాయీ కథలు. సమూహంలో ఉంటూనే ఏకాంతంలోకి తీసుకెళతాయీ పాత్రల స్వగతాలు.

కథల చందం – విదేశాలలో అర్థంతరంగా తనువు చాలించినవారిని స్వదేశానికి సాయపడే హృదయాలు ఎంత బరువెక్కుతాయో ‘ఈ కానుకనివ్వలేను’ తెలిపితే, ఖరీదులోనో హైక్లాసు లెవల్ తోనో బాల్యాన్ని సమాధానపరచలేమని ‘చందనపుబొమ్మ’ కళ్లకు కడుతుంది. ప్రకృతి సోయగాలను తిలకించే అదృష్టం చేజార్చుకున్నవారు శాపగ్రస్తులంటుంది ‘భ్రమణకాంక్ష’. కొత్తపదాలను కనిపెట్టమనే రచయిత్రి అర్థింపు వర్డ్ క్యాన్సర్లో కనిపిస్తే, శృంగారం గురించి మాట్లాడటమే తప్పుగా భావించే సమాజంలో ఎదుర్కొన్న సమస్యలను, సమాధానపడిన విధానం ‘ఎవరికి తెలియని కథలివిలే!’ తెలియజేస్తుంది. కథలన్నీ అంతర్లోక ప్రయాణం ప్రయాణం చేస్తుంటే హాస్యం వ్యంగంతో కూడిన ‘24-7 క్రైమ్’ ఈ మాలికలో ఇమడలేదనిపిస్తుంది.

శైలి – ‘వాక్యమంటే వానవిల్లుమీద నడిచి మేఘాలలో తేలినట్టుండాలి’ అని చెప్పే ఎన్నో అందమైన వర్ణనలు, అంతర్మథనాలు ఈ కథలలో చోటుచేసుకున్నాయి. తమలోకి తాము ప్రయాణించాలనుకునేవారికి ఈ కథలు సరైన ఊతమిస్తాయి.

– నిర్మలారెడ్డి

One thought on “అంతరంగాల కొమ్మ (21.4.2013 సాక్షి ఫన్ డే సమీక్ష)

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s