మీరు గుంటూరువారా? అయితే మంగాదేవిగారు తెలుసా?

మామూలుగా అందరికీ గుండెలో ఉండేవి నాలుగు గదులు. కానీ గుండెలో రెండే గదులుండి, ఒక గది నిండా భావి ప్రపంచాన్ని రూపుదిద్దవలసిన పసిపిల్లలు – రెండో గది నిండా ప్రపంచాన్నే ఆహ్లాదపరిచే పచ్చటి మొక్కలను నింపుకొన్న మనిషిని చూడాలనుకుంటే మాత్రం గుంటూరు వెళ్లి ‘శ్రీవేంకటేశ్వర బాల కుటీర్’ పాఠశాల నడుపుతున్న డాక్టర్ నన్నపనేని మంగాదేవిని కలవాల్సిందే. పుస్తకాల బరువు లేకుండా ఆ బడిలో చక్కగా చదువుకుంటున్న చిన్నారులను పలకరించాలి… అనాథ పిల్లలకు అన్నీ తానే అయి వాళ్ల భవిష్యత్తును నిలబెడుతున్న వైనాన్ని పరికించాలి… ఎన భైకి దగ్గర పడుతున్న వయసులోనూ మంగాదేవి ఆలోచనల్లోని చురుకుదనాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే పదండి…

mangaతెనాలిలో పుట్టిన నన్నపనేని మంగాదేవి చదువుకుని మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగంలో చేరేవరకూ అందర్లాంటి మామూలు స్త్రీనే. అక్కడ చేరిన తర్వాత ఇబ్బందుల్లో ఉన్న మహిళలు, ముఖ్యంగా బాలల కోసం ఏమైనా చెయ్యాలనిపించింది ఆమెకు. మంగాదేవి ఆలోచనలకు సహోద్యోగి ప్రభావతి రూపాన్నిచ్చారు. అప్పటికే పూర్తిచేసిన మాంటిసోరి శిక్షణ ప్రభావంతో పాఠశాల మొదలెట్టాలనుకున్నారు. ‘పుస్తకాలు లేకుండా చదువు నేర్పిస్తామంటే తల్లిదండ్రులు నవ్వేవాళ్లు తప్ప నమ్మేవాళ్లు కాదు… దాంతో పిల్లలు రావడమే కష్టమైంది’ అని గతాన్ని గుర్తుచేసుకున్న మంగాదేవి ఒక్క పాపతో 1965లో ‘శ్రీవేంకటేశ్వర బాలకుటీర్’ను ప్రారంభించారు. ఆటపాటలతో, ప్రకృతికి దగ్గరగా చదువు చెప్పే విధానం పిల్లలనూ పెద్దలనూ కూడా ఆకట్టుకోవడంతో ఆ చిన్న పాఠశాల పెద్దగా విస్తరించింది.

మదర్ థెరెసా స్ఫూర్తితో…
క్రమశిక్షణకు, మంచి చదువుకు మారుపేర న్న ఖ్యాతిని సంపాదించుకుంది. ఆ సమయంలో మంగాదేవి మదర్ థెరెసాను కలిశారు. ఆమె పంచిన స్ఫూర్తితో ‘చేతన’ అనే మరో సంస్థను స్థాపించారు. ‘చేతన’ అనాథ పిల్లలను సంర క్షించి విద్యాబుద్ధులు నేర్పిస్తుంది, ఒంటరి మహిళలకు తోడై నిలిచి వాళ్ల కాళ్ల మీద వారు నిలబడేలా చేయూతనిస్తుంది. ఈ పిల్లలకు ‘బాలకుటీర్’లో చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు చేయూతనివ్వడం గొప్ప విషయం. “మా స్కూల్లోని పిల్లలు ఏడాది మొదట్లో తాము పుస్తకాలు కొనుక్కుంటున్నప్పుడే చేతనలోని పిల్లల కోసమని రెండు నోట్‌బుక్స్, రెండు పెన్సిళ్లు… ఇలా కొనిస్తారు. పాత పాఠ్యపుస్తకాలను చక్కగా బైండ్ చేయించి ఇస్తారు మరికొందరు.

ప్రతి విద్యార్థీ చేసేది చిన్న సాయమే అయినా అదే అనా«థ పిల్లల పాలిట కొండంత వరం. వాళ్లకు ఏడాది పొడుగునా పుస్తకాల కొరత లేకుండా చేస్తుందీ పని” అంటారు మంగాదేవి. అలాగని అదేమీ నిర్బంధం కాదు. ముప్పయ్యేళ్లుగా ‘బాలకుటీర్’లో ఆమె నెలకొల్పిన నైతిక విలువల ఫలితం ఇది. “కొందరు తల్లిదండ్రులు తామే ముందుకొచ్చి చేతనలోని పిల్లలకు అవసరమైనవి సమకూరుస్తారు, పిల్లల పుట్టినరోజులకు వృధా ఖర్చులు పెట్టకుండా ఆ సొమ్మును ఈ విధంగా వినియోగిస్తారు” అని ఆనందంగా చెప్పారు మంగాదేవి. ‘సాహిత్యం తోడుగా పెరిగిన పిల్లలు పెద్దయ్యాక మంచి పౌరులవుతారు’ అని నమ్మే మంగాదేవి పిల్లల కోసం ఇప్పటికి ముప్ఫైకి పైగా పుస్తకాలు రాశారు.

నిత్య చైతన్యం…
గుంటూరు పట్టణ శివార్లలో ఉన్న ‘చేతన’ పేరుకు తగినట్టే నిత్యచైతన్యంతో తొణికిసలాడుతూ ఉంటుంది. ఒక్కో పనికీ ఒక్కో విభాగం. ప్రచారం ఏమీ లేకుండా నిశ్శబ్దంగా వేటి పని అవి చేసుకుపోతుంటాయి. చుట్టుపక్కల క్వారీల్లో పనిచేసే పేదకార్మికుల పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యనందిస్తుంది ‘నందన’. దాదాపు 220మంది అనాథ పిల్లలను చేరదీసి భవిష్యత్తును నిర్మిస్తోంది ‘హీల్’ (హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్). వివిధ కారణాల వల్ల బడి గడపకు రాలేని చుట్టుపక్కల గ్రామీణ పేద పిల్లల ముంగిటికి బస్సే బడిగా ముస్తాబయి వెళుతుంది. చెవిటి, మూగ పిల్లల చదువుకు ‘శృతి’, గ్రామీణ యువతకు శిక్షణనిస్తూ ‘కృషి’ ఎప్పుడూ సందడిగా కనిపిస్తాయి అక్కడ. ఒంటరి మహిళల కోసం ‘రక్ష’, కుటుంబాలు విడిపోకుండా సలహానిచ్చే కేంద్రం ‘జీవనరేఖ’, కళల వికాసం కోసం ‘సృజన’ ప్రత్యామ్నాయ వైద్య విధానాలతో ఏ అనారోగ్యాన్నయినా సరి చేసే ‘స్వస్థ’ – ఇవన్నీ ‘చేతన’కు చేతుల్లా పనిచేస్తాయి. ‘మన ప్రయత్నం మంచిదైతే సాయం నలుమూలల నుంచీ దానంతటదే వస్తుంది. ప్రతి పనికీ ప్రభుత్వ సాయం కావాలని కూచుంటే మాత్రం అడుగు ముందుకెయ్యలేం’ అని చెప్పే మంగాదేవికి ఆమె స్నేహితులే బలం, బలగం. ఆలోచన ఆమెది. ఆచరణలోకి తెచ్చే బాధ్యతను వాళ్లే సంతోషంగా స్వీకరిస్తారు. కొత్తవాళ్లయినా ఒక్కసారి ‘చేతన ‘ను సందర్శించాక స్ఫూర్తి పొందకుండా ఉండలేరు.

దోసెడంత తొట్టెలో….
28 ఎకరాల విస్తీర్ణంలో విరిసిన ‘చేతన’లో ఏ కాలంలోనైనా, ఏ మూలనైనా పువ్వులు కళకళ్లాడుతూ కనిపిస్తాయి. దానికి కారణం మంగాదేవి ప్రకృతి ప్రేమికురాలు కావడం ఒక్కటే కారణం కాదు. ‘బోన్సాయ్’ వృక్షాల పెంపకంలోనూ, పుష్పాలంకరణ కళ ‘ఇకెబెనా’లోనూ ఆమె నిష్ణాతురాలు కావడంతో ఆ ప్రాంగణంలోని అడుగడుగూ అందాలు చిందేలా ఉంటుంది. ఎన్నెన్నో పుస్తకాలు చదివి ఈ రెండు కళల్లోనూ పట్టు సంపాదించిన మంగాదేవి తాను నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టడంతో ‘చేతన’ ప్రాంగణమంతా అరుదైన వామన వృక్షాలతో, అందాల పువ్వుల చెట్లతో ఒక నందనవనంలాగా అనిపిస్తుంది. వ్యాపారవేత్తలైతే తమ వ్యాపార రహస్యాలను ఎవరితోనూ పంచుకోరుగానీ, మంగాదేవి స్వతహాగా విద్యావేత్త కావడం వల్ల తాను నేర్చుకున్న కళను నలుగురికీ నేర్పడానికి ఉత్సాహంగా ఉంటారు.

ఆమె రాసిన ‘వామన వృక్షాలు’ పుస్తకం తెలుగులో బోన్సాయ్ కళకు మొట్టమొదటి కరదీపిక. దోసెడంత తొట్టెలో, చేరెడంత మట్టితో మూరెడంత ఎత్తుకు ఎదిగే మర్రిచెట్టుకు ఊడలు, నిమ్మచెట్టుకు కాయలు చూస్తే… అబ్బురంగా ఉంటుంది. బోన్సాయ్ చరిత్రనూ, వాటిని పెంచే విధానాన్నీ, మన వాతావరణ పరిస్థితులకు తగినట్టు పాటించాల్సిన మెళకువల్నీ సవివరంగా అందించిన ఆమె పుస్తకం వృక్ష ప్రేమికులకు పెద్ద వరం. ‘ఒక్క మనిషి జీవితంలో ఇన్ని పనులు చెయ్యడం సాధ్యమేనా’ అనిపిస్తుంది మంగాదేవిని చూనినపుడు. బహుశా మొక్కల్నీ, పిల్లల్నీ ప్రేమించేవాళ్లకు ఆ శక్తి సహజంగా వస్తుందేమో!

Advertisements

2 thoughts on “మీరు గుంటూరువారా? అయితే మంగాదేవిగారు తెలుసా?

  1. Aruna garu, chala baaga vrasaru. Guntur velte, Manga Devi gaari Balakutir ni, Chetana ni tappakunda chudalani anipistundi.

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s